అసోం ముఖ్యమంత్రి దంపతులకు కోర్టు సమన్లు

ABN , First Publish Date - 2022-02-24T13:57:50+05:30 IST

అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ, అతని భార్య రినికి భుయాన్‌లకు కమ్రూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమన్లు ​​జారీ చేశారు....

అసోం ముఖ్యమంత్రి దంపతులకు కోర్టు సమన్లు

గౌహతి : అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ, అతని భార్య రినికి భుయాన్‌లకు కమ్రూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమన్లు ​​జారీ చేశారు. ముఖ్యమంత్రి దంపతులిద్దరూ ఈ నెల 25వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కమ్రూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అస్సామీ న్యూస్ ఛానెల్ ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ అయిన రినికి భుయాన్‌లకు జడ్జి సమన్లు జారీ చేశారు.మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శర్మ మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనితోపాటు న్యూస్ లైవ్ టీవీ ఛానెల్‌పై అదనపు ప్రధాన ఎన్నికల అధికారి 2019వ సంవత్సరంలో కేసు దాఖలు చేశారు.


అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.రినికి భుయాన్ శర్మ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఛానెల్ లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ సీఎం ఇంటర్వ్యూను ప్రసారం చేసిందని కోర్టు పేర్కొంది.


Updated Date - 2022-02-24T13:57:50+05:30 IST