Abn logo
Mar 1 2021 @ 12:06PM

హిమజకు పవన్ లేఖ!

నటి హిమజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన అభిమాన నటుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాయడంతో హిమజ మురిసిపోతోంది. పలు సీరియళ్లు, `బిగ్‌బాస్` కార్యక్రమంతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించున్న హిమజ.. పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్రకు హిమజ ఎంపికైంది. తన అభిమాన నటుడితో కనిపించే ఛాన్స్ రావడంతో హిమజ ఉబ్బితబ్బిబ్బవుతోంది. 

పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పవన్ తనకు రాసిన లేఖను హిమజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను` అని పేర్కొంటూ పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. `నా ఆనందాన్ని మాటల్లోనూ, ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నాన`ని పేర్కొంది. 


Advertisement
Advertisement
Advertisement