హిమ..200మీ.కే పరిమితమా ?

ABN , First Publish Date - 2022-08-13T09:34:18+05:30 IST

హిమాదాస్‌..2018 వరల్డ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప 400మీ. పరుగులో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించిన స్ర్పింటర్‌. ఆ ఒక్క టైటిల్‌తో ఆమె దేశ..

హిమ..200మీ.కే పరిమితమా ?

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): హిమాదాస్‌..2018 వరల్డ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప 400మీ. పరుగులో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించిన స్ర్పింటర్‌. ఆ ఒక్క టైటిల్‌తో ఆమె దేశ స్టార్‌ అథ్లెట్‌గా మారిపోయింది. కానీ ప్రస్తుతం ఈ అసోం రన్నర్‌ 200మీ.లలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈనేపథ్యంలో దాస్‌ మళ్లీ తనకిష్టమైన 400మీ.లోకి ఎప్పుడు పునరాగమనం చేస్తుందనే ప్రశ్నకు ‘చాలా సంవత్సరాలు భారత అథ్లెట్లు 400మీ.లలో పాల్గొనడాన్నే ప్రపంచం చూసింది. 200 మీ.లోనూ మనం ఎలా సత్తా చాటుతామో వారికి చూపాలి’ అని హిమ సమాధానం ఇచ్చింది. ఆమె జవాబు చూస్తే హిమ ఇక 400మీ.లకు బై చెప్పినట్టేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ అనంతరం 2018 జకార్తా ఆసియా క్రీడల 400మీ. ఈవెంట్‌ ఫైనల్లో తన జాతీయ రికార్డు తిరగరాసిన దాస్‌ రజత పతకం అందుకుంది. అయితే 2019 దోహా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పనకు ఎంపికైన హిమ..వెన్ను నొప్పితో ఆ టోర్నీలో పాల్గొనలేదు.


అప్పటినుంచి 400 మీ.కు దూరంగా ఉన్న ఆమె తన దృష్టిని 200 మీ. పరుగువైపు మళ్లించింది. 400మీ.లో బరిలోకి దిగే విషయమై ఇంకా మాట్లాడుతూ ‘తొందరపడడంలేదు. నా శరీరం సహకరించడంపై, కోచ్‌లు, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌, ఫిజియోలు ఇచ్చే సలహాలపై అది ఆధారపడి ఉంది’ అని ‘థింగ్‌ ఎక్స్‌ప్రె్‌స’గా అథ్లెటిక్స్‌ వర్గాలు ముద్దుగా పిలుచుకొనే హిమాదాస్‌ అంది. వచ్చే ఏడాది చైనాలో జరిగే ఏషియన్‌ గేమ్స్‌ ద్వారా 22 ఏళ్ల దాస్‌ 400మీ.లో పునరాగమనం చేస్తుందని అంచనావేస్తున్నారు. కానీ మరింత ఆలస్యం అవుతుందన్న సంకేతాలను ఆమె ఇచ్చింది. ఆసియా క్రీడల్లో 200 మీ. పరుగులో పోటీపడడం ద్వారా తనను తాను పరీక్షించుకోవాలని హిమ భావిస్తోంది. ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 200మీ.లలో ఆమె తలపడింది. సెమీఫైనల్‌ రేసును 23.42సె. పూర్తి చేసిన దాస్‌ త్రుటిలో ఫైనల్‌ అవకాశాన్ని చేజార్చుకుంది. ఫైనల్‌ ఆటోమేటిక్‌ క్వాలిఫయింగ్‌ సమయం 23.41సె. కావడం గమనార్హం. 


నిరాశ కలిగించింది..:

కామన్వెల్త్‌ వైఫల్యం నిరాశ కలిగించిందని హిమ చెప్పింది. ‘ఫైనల్‌కు అర్హత సాధించకపోవడం బాధించింది. అయినా వాస్తవాన్ని అంగీకరించాలి. పతకాలకోసం కాక సమయాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను ప్రాధాన్యమిస్తా. బర్మింగ్‌హామ్‌లో నమోదు చేసిన టైమింగ్‌పై సంతృప్తిగా ఉన్నా’ అని హిమాదాస్‌ పేర్కొంది. 

Updated Date - 2022-08-13T09:34:18+05:30 IST