Flash floods:పర్యాటకులకు హిమాచల్ సర్కారు హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-13T17:54:32+05:30 IST

భారీవర్షాలు...మెరుపు వరదల నేపథ్యంలో పర్యాటకులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హెచ్చరిక జారీ చేసింది.....

Flash floods:పర్యాటకులకు హిమాచల్ సర్కారు హెచ్చరిక

డెహ్రాడూన్ : భారీవర్షాలు...మెరుపు వరదల నేపథ్యంలో పర్యాటకులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హెచ్చరిక జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వచ్చిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. హిమాచల్ పర్యటనకు వెళ్లిన తమ కుటుంబసభ్యులు వరదల్లో చిక్కుకుపోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్నందు వల్ల స్థానిక ప్రజలు, పర్యాటకులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని అధికారులు సూచించారు.వదనీటితో నదులు పొంగి పొర్లుతున్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సర్కారు కోరింది. 


వరదల వల్ల పలు రోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. పలు ఇళ్ల వరదనీటి ధాటికి దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు, సహాయ పునరావాస సిబ్బంది రంగంలోకి దిగి లోయలోని రోడ్లను శుభ్రం చేస్తున్నారు.కాంగ్రా జిల్లాలో మంగళవారం వరదనీటిలో చిక్కుకుపోయిన ఏడుగురు గ్రామస్థులను సహాయ సిబ్బంది రక్షించారు. వరదల్లో 9 మంది గల్లంతు అయ్యారని సీనియర్ ఎస్పీ విముక్త్ రంజన్ చెప్పారు.అతి భారీవర్షాల వల్లనే కాంగ్రా జిల్లాలో వరదలు పోటెత్తాయని కాంగ్రాజిల్లా డిప్యూటీ కమిషనర్ నిపుణ్ జిందాల్ చెప్పారు.


 భారీవర్షాలు వరదల వల్ల మాంఝీ నది పొంగి ప్రవహిస్తోంది. వరదల వల్ల 10 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు సందీప్ కుమార్ చెప్పారు. గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని మంగళవారం మూసివేశారు. బార్డర్ రోడ్ డెవలప్ మెంట్ అధికారులు రోడ్లపై పడిన కొండచరియలను తొలగిస్తున్నారు. 


Updated Date - 2021-07-13T17:54:32+05:30 IST