హిమాచల్ మంత్రితోపాటు ఇద్దరు కూతుళ్లకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-07T11:06:05+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సుఖ్ రాం చౌదరితోపాటు అతని ఇద్దరు కుమార్తెలకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది....

హిమాచల్ మంత్రితోపాటు ఇద్దరు కూతుళ్లకు కరోనా పాజిటివ్

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సుఖ్ రాం చౌదరితోపాటు అతని ఇద్దరు కుమార్తెలకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. మంత్రి సుఖ్ రాం వ్యక్తిగత సహాయకుడు సోనూ చౌదరికి కరోనా సోకడంతో మంత్రి కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. కరోనా సోకిన మంత్రి సుఖ్ రాంను సిమ్లాలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి, మంత్రి ఇద్దరు కుమార్తెలను సిమ్లాలోని కొవిడ్ కేర్ సెంటరుకు తరలించి చికిత్స చేస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ ఆర్డీ థీమాన్ చెప్పారు. మంత్రి చౌదరి త్వరగా కోలుకోవాలని సీఎం జైరాంఠాకూర్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కరోనా సోకిన మంత్రిని గతంలో కలిసిన ఎమ్మెల్యే పొంతా సాహిబ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ లో 131 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హిమాచల్ లో 1965 మందికి కరోనా సోకగా, వారిలో 13 మంది మరణించారు.

Updated Date - 2020-08-07T11:06:05+05:30 IST