తెలంగాణ పథకాలపై హిమాచల్ ప్రదేశ్ సీఎస్ ఆసక్తి

ABN , First Publish Date - 2022-02-08T01:20:59+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ సోమవారం తెలంగాణ

తెలంగాణ పథకాలపై హిమాచల్ ప్రదేశ్ సీఎస్ ఆసక్తి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ సోమవారం తెలంగాణ సచివాలయం, బి.ఆర్.కె.ఆర్ భవన్ కు వచ్చారు. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.


ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ కు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లాగ్ షిప్ కార్యక్రమాల గురించి సీఎస్ సోమేశ్ కుమార్ సూచనల మేరకు  ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శ ఎస్.ఎ.యం. రిజ్వీ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హిమాచల్ ప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్ విభాగం అదనపు కార్యదర్శి అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-08T01:20:59+05:30 IST