తబ్లీగీ సదస్సుకు హాజరైన వారికి హిమాచల్ సీఎం అల్టిమేటం

ABN , First Publish Date - 2020-04-05T23:46:09+05:30 IST

సోలన్ జిల్లాలోని ఓ మసీదులో దాగి ఉన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆ ముగ్గురికీ పాజిటివ్ అని వచ్చినట్లు

తబ్లీగీ సదస్సుకు హాజరైన వారికి హిమాచల్ సీఎం అల్టిమేటం

సిమ్ల: తబ్లీగీ జమాత్ సదస్సుకు హాజరైన వారందరూ ఆదివారం 5 గంటల కన్నా కరోనా పరీక్షలకు హాజరు కావాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ థాకూర్ అల్టిమేటం జారీ చేశారు. తబ్లీగీ జమాతే సభ్యులు ఎవ్వరూ అధికారులకు సహకరించడం లేదని, ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా పరీక్షలకు హాజరు కావాలని, లేదంటే ఎలాంటి హెచ్చరికలు లేకుండానే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


సోలన్ జిల్లాలోని ఓ మసీదులో దాగి ఉన్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆ ముగ్గురికీ పాజిటివ్ అని వచ్చినట్లు జయరామ్ థాకూర్ ప్రకటించారు.  ఇదే హెచ్చరికను ఒకరోజు ముందు రాష్ట్ర డీజీపీ సీతారాం మార్ది కూడా జారీ చేశారు. తబ్లీగీ జమాతే సదస్సుకు హాజరైన వారి వివరాలను స్వయంగా వారే ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-04-05T23:46:09+05:30 IST