‘కాంట్రాక్ట్’ కొలువులపట్ట పెరిగిన ఆసక్తి : ఇండీడ్

ABN , First Publish Date - 2020-10-30T23:07:50+05:30 IST

ఒప్పంద/తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే ఉద్యోగాలపట్ల ఉద్యోగార్ధులకు ఆసక్తి పెరుగుతోందని ఇండీడ్ నివేదిక వెల్లడించింది.

‘కాంట్రాక్ట్’ కొలువులపట్ట పెరిగిన ఆసక్తి : ఇండీడ్

న్యూఢిల్లీ : ఒప్పంద/తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే ఉద్యోగాలపట్ల ఉద్యోగార్ధులకు ఆసక్తి పెరుగుతోందని ఇండీడ్ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి - జూలై మధ్య ఈ ఉద్యోగాలకు 119 శాతం మేర డిమాండ్ పెరిగిందని నివేదించింది. నియామక ప్రకటనల్లోనూ 119 శాతం వృద్ధి ఉన్నట్లు వెల్లడించింది. కరోనా పరిమాణాల నేపధ్యంలో వివిధ రంగాల్లో గతంలో సంస్థల  మూసివేతలు, ఉత్పత్తుల కోత వంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఇందుకు కారణమని తెలిపింది.


ఈ ఏడాది జనవరి నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిమాండ్ క్రమేపీ పెరుగుతోందని  ఈ నివేదిక తెలిపింది. కిందటి సంవత్సరం జూన్, జూలైతో పోలిస్తే 2020 జూన్, జూలై నెలల్లో వరుసగా కాంట్రాక్ట్ నియామకాలు 110 శాతం, 143 శాతం చొప్పున పెరిగినట్లు తెలిపింది. వెబ్ సైట్‌లో ఒప్పంద ఉద్యోగాల కోసం అన్వేషించడం కూడా మూడింతలు పెరిగినట్లు వెల్లడించింది.


తమ వెబ్‌సైట్ ప్రకారం... భారత జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పువస్తోందని, తాత్కాలిక ఉద్యోగాలకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-30T23:07:50+05:30 IST