హిజాబ్‌ వివాదం... బళ్లారిలో ప్రిన్సిపాల్‌తో వాగ్వాదం

ABN , First Publish Date - 2022-02-17T18:01:54+05:30 IST

దేశమంతా చర్చనీయాంశమైన హిజాబ్‌ వివాదం బుధవారం బళ్లారి నగరానికి కూడా వ్యాపించింది. కళాశాల ముందు ఉపన్యాసకులు, పోలీసులు, విద్యార్థినులు, పోషకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగరంలోని సరళాదేవి ప్రభుత్వ

హిజాబ్‌ వివాదం... బళ్లారిలో ప్రిన్సిపాల్‌తో వాగ్వాదం

బళ్లారి(కర్ణాటక): దేశమంతా చర్చనీయాంశమైన హిజాబ్‌ వివాదం బుధవారం బళ్లారి నగరానికి కూడా వ్యాపించింది. కళాశాల ముందు ఉపన్యాసకులు, పోలీసులు, విద్యార్థినులు, పోషకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగరంలోని సరళాదేవి ప్రభుత్వ ప్రథమ ధర్జీ కాలేజ్‌కు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థినులను కళాశాల సిబ్బంది గేట్‌ దగ్గర  ఆపి తరగతి గదిలోకి హిజాబ్‌ ధరించి రాకూడదన్నారు. దీనికి ఒప్పుకున్న విద్యార్థినులు తరగతి గదిలోకి వెళ్లిన తరువాత హిజాబ్‌ తీసేది లేదనడంతో వారిని తరగతి నుంచి బయటకు పంపారు. అనంతరం హిజాబ్‌ ధరించిన విద్యార్థినులు తమకు విద్యకంటే ధర్మమే ముఖ్యమని, ఇంటర్నల్‌ పరీక్ష వదిలి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని ఆపి ప్రిన్సిపాల్‌ నచ్చచెప్పగా పరీక్షకు హాజరయ్యారు. అక్కడికి చేరిన విద్యార్థుల తల్లిదండ్రులను వివాదానికి అవకాశం కల్పించవద్దని పిన్సిపాల్‌ వేమన్న, సిబ్బంది కోరారు.

Updated Date - 2022-02-17T18:01:54+05:30 IST