హైవే పనులకు అంతరాయం

ABN , First Publish Date - 2021-01-12T05:25:30+05:30 IST

ఓ వైపు రేయింబ వళ్లు సాగుతున్న తల్లాడ–దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణ పనులకు భారీగా వాహనాల రాకపోకలతో అంతరాయం ఏర్పడుతోంది.

హైవే పనులకు అంతరాయం
గోపాలపురంలో హైవేపై నిలిచిన వాహనాలు

భారీ వాహనాల రాకతో ట్రాఫిక్‌ రద్దీ

తరచూ తలెత్తుతున్న ఇబ్బందులు 

గోపాలపురం, జనవరి 11 : ఓ వైపు రేయింబ వళ్లు సాగుతున్న తల్లాడ–దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణ పనులకు భారీగా  వాహనాల రాకపోకలతో అంతరాయం ఏర్పడుతోంది. హైవే పనులు దేవరపల్లి నుంచి జగన్నాథపురం వరకు సుమారు రూ.90 కోట్ల కేంద్ర నిధులతో  సాగుతున్నాయి. అయితే ఈ రహదారిపై  ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు వేల  సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడంతో పనులకు అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడిక్క ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణం ముందుకు సాగకపోవడంతో పాటు నిర్మాణ పనులకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది.   గత ఏడాది  భారీ వర్షాలు కురవడంతో పనులు సుమారు రెండు నెలల పాటు నిలిచిపోయాయి. దీనికి తోడు వాహనాల రద్దీ అదనం కావడంతో నిర్మాణ పనులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ రహదారి పనులు సకాలంలో పూర్తి కావాలంటే దేవరపల్లి వద్ద రాకపోకలను విజయవాడ వైపు మళ్లించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-01-12T05:25:30+05:30 IST