Advertisement
Advertisement
Abn logo
Advertisement

పల్లెల్లో ‘హైటెన్షన్‌’!

  పలు చోట్ల ఇళ్ల పైనుంచి వెళుతున్న విద్యుత్‌ లైన్లు

 డాబాలపై చేతికి అందే ఎత్తులో ఉండడంతో భయాందోళనలు

 ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని వేడుకోలు

అచ్యుతాపురం, అక్టోబరు 25: మండలంలోని పలు గ్రామాల్లో హైటెన్షన్‌  విద్యుత్‌ వైర్లు భయపెడుతున్నా యి. ఇళ్ల పైనుంచి వెళుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నివాసి తులు హడలిపోతున్నారు. మల్లవరం, ఉప్పవరం గ్రామాల్లో మరింత వణుకు పుడుతోంది. గతంలో ఈ విద్యుత్‌ వైర్లు పంట పొలాల మధ్య నుంచి ఉండేవి. హుద్‌హుద్‌ తుఫాన్‌ కారణంగా ఎక్కడి కక్కడ వైర్లు తెగిపడిపోవడంతో అప్పట్లో సదరు శాఖ అధికారులు ఈ లైన్‌ను గ్రామాల మధ్యలోంచి వేశారు. ప్రస్తుతం ఇంటి పైకప్పు ఎక్కితే చేతికి అందినంత ఎత్తులో వైర్లు ఉన్నాయి. దీంతో చిన్న పాటి వర్షానికి తడిసిన గోడలను ముట్టు కున్నా అప్పుడప్పుడు షాక్‌ కొడుతున్నా యని పలువురు చెపుతున్నారు.   ఇదిలా వుంటే, పలు గ్రామాల్లో విద్యుత్‌ షార్ట్‌  సర్క్యూట్‌ కారణగా విద్యుత్‌ మీటర్లతో పాటు ఫ్యాన్లు, టీవీలు, విద్యుత్‌ ఉపక రణాలు కాలిపోతున్నాయని వాపోతు న్నారు. జరగరాని నష్టం జరగకముందే  అధికారులు స్పందించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement