Abn logo
Sep 17 2021 @ 00:32AM

మహోన్నతులు అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌

అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాల ఆవిష్కరణలో రామారావు, బుజ్జి

పాయకరావుపేట రూరల్‌, సెప్టెంబరు 16 : దేశంలో దళితులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసిన మహో న్నతులు డాక్టర్‌ అంబేడ్కర్‌, బాబూజగ్జీవన్‌రామ్‌లని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి అన్నారు. పెదరాంభద్రపురం ఎస్సీ కాలనీలో గురువారం వీరాంజనేయ యువజన సంఘంలో ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాల ఆవిష్కరణలో మాట్లాడారు. యువత వీరిరువురి జాడలో నడవాలని సూచించారు.  సర్పంచు గంపల మార్తమ్మ, మాజీ సర్పంచు త్రిపర్ణ సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు జి.శ్రీనివాసరావు, వంగలపూడి రామారావు, మేడిశెట్టి రాము, దళిత నాయకులు గంపల చిట్టిబాబు, నూకరాజు, చక్రవర్తి,  శ్రీను, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.