పాంగోలిన్‌కు భారీ భద్రత.. చైనా నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-07T03:57:17+05:30 IST

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ తరుణంలో పాంగోలిన్ జంతువులకు అత్యున్నత భద్రత కల్పించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.

పాంగోలిన్‌కు భారీ భద్రత.. చైనా నిర్ణయం

బీజింగ్: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ తరుణంలో పాంగోలిన్ జంతువులకు అత్యున్నత భద్రత కల్పించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి పాంగోలిన్ జీవులకు పాకిందని, అక్కడి నుంచే మనుషులకు సోకి ఉంటుందని కొందరు పరిశోధకులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాంగోలిన్‌ల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని, భారీగా వేటాడటం.. ఈ జీవులు నివశించే ప్రాంతాలను ధ్వంసం చేయడం వల్లే ఇలా జరుగుతోందని అధికారులు చెప్పారు. అందుకే ఈ జీవులు అంతరించి పోకుండా ఉండేదుకు వీటికి భద్రత కల్పించాలని చైనా ప్రభుత్వ నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో అటవీ మృగాల వేట, తినడాన్ని చైనా నిషేధించింది.

Updated Date - 2020-06-07T03:57:17+05:30 IST