వన్డే చరిత్రలోనే అతి భారీ స్కోరు.. పృధ్వీషా డబుల్ సెంచరీతో..

ABN , First Publish Date - 2021-02-26T02:53:15+05:30 IST

వన్డేల్లోనే అతి భారీ స్కోరు సాధించి ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఏకంగా 450 పైగా పరుగులు చేసి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. కెప్టెన్ పృధ్వీషా 152 బంతుల్లో 227 పరుగులతో(31 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ డబుల్ సెంచరీకి తోడు..

వన్డే చరిత్రలోనే అతి భారీ స్కోరు.. పృధ్వీషా డబుల్ సెంచరీతో..

ముంబై: వన్డేల్లోనే అతి భారీ స్కోరు సాధించి ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఏకంగా 450 పైగా పరుగులు చేసి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. కెప్టెన్ పృధ్వీషా 152 బంతుల్లో 227 పరుగులతో(31 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ డబుల్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(133: 58 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సులు)తో విజృంభించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 457 పరుగులు భారీ స్కోరు చేసింది. భారత గడ్డపై వన్డే చరిత్రలో ఇన్ని పరుగులు ఇంతవరకు ఏ జట్టూ నమోదు చేయలేదు. పృధ్వీషా, సూర్యకుమార్ ధాటికి ప్రత్యర్థి పుదుచ్చేరి బౌలర్లు విలవిల్లాడిపోయారు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఈ అరుదైన ఘనత సాధించింది.


 ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు ఆదిత్య తారే(56: 64 బంతుల్లో 7 ఫోర్లు) కూడా అర్థ సెంచరీతో రాణించాడు. ఇదిలా ఉంటే 458 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి 38.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్ప కూలింది. పుదుచ్చేరి తరపున డీ రోహిత్(63: 68 బంతుల్లో) ఒక్కడే అర్థ సెంచరీ చేశాడు.

Updated Date - 2021-02-26T02:53:15+05:30 IST