Highest Currency Value in the World: అమెరికన్ డాలర్లంటే అక్కడ చిల్లపెంకులు... చిల్లరపైసలే...

ABN , First Publish Date - 2022-10-01T16:06:36+05:30 IST

మనకు తెలిసింది కేవలం అమెరికన్ డాలర్ గురించి మాత్రమే కానీ ప్రపంచంలో అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ ఉంది. డాలర్ కు జేజమ్మల్లాంటి కరెన్సీ గురించి వింటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది.

Highest Currency Value in the World: అమెరికన్ డాలర్లంటే అక్కడ చిల్లపెంకులు... చిల్లరపైసలే...



డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా... అని సలహా ఇచ్చాడో సినీకవి. ‘డబ్బురా డబ్బు డబ్బు రా... డబ్బు డబ్బే డబ్బు డబ్బు రా’ - అని అంతగా నొక్కిచెప్పడానికి కారణమేంటో ఆ కవే చెప్పాడు: 'పుట్టడానికీ పాడే కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ...'.  ప్రాంతాలు... దేశాలు వంటి ఎల్లలతో సంబంధం లేకుండా డబ్బు విలువ అంతే. మహా  అయితే ప్రాంతాలు మారేకొద్ది వాడుకలో ఉన్న కరెన్సీ మారుతుందంతే. కేవలం మారడమే కాదు ఆ కరెన్సీ విలువ కూడా వేరుగా ఉంటుంది. వేరు వేరు దేశాల కరెన్సీలను కంపేర్ చేసినపుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయిపోతాయి. ముఖ్యంగా భారతదేశ రుపాయిని అమెరికన్ డాలర్స్ తో పోల్చడం సర్వసాధారణం. 1913 సంవత్సరంలో ఒక అమెరికన్ డాలర్ విలువ భారతదేశ రుపాయిలో 0.09 గా ఉండేది. అది క్రమక్రమంగా పెరుగుతూ ఈరోజుకు ఒక అమెరికన్ డాలర్ విలువ 79.71 భారతదేశ రుపాయలకు సమానంగా మారింది. అమెరికాలో ఉద్యోగస్తుల సంపాదన కుడా డాలర్స్ లెక్కలోనే ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలని భారతీయ యువత ఉబలాటం. అయితే మనకు తెలిసింది కేవలం అమెరికన్ డాలర్ గురించి మాత్రమే కానీ ప్రపంచంలో అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ ఉంది. డాలర్ కు జేజమ్మల్లాంటి కరెన్సీ గురించి వింటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. 


ప్రపంచంలో అతి ఖరీదైన కరెన్సీలు, ఆ దేశాలు, వాటి పేర్లు ఇవే.....



కువైట్ దినార్


దీన్ని KWD అని పిలుస్తారు. ప్రపంచంలో అతిపెద్ద కరెన్సీగా కువైట్ దినార్ నిలుస్తుంది. ఒక కువైట్ దినార్ 260 ఇండియన్ రుపీస్ కు సమానం. భారతీయులు ఎక్కువగా కువైట్ కు వెళుతుండటం వల్ల దీని మారకం ఇండియన్ రుపీస్ లో బలపడింది. మరొక విషయం ఏమిటంటే కువైట్ లో ఉండి సంపాదించేవారు అక్కడ ఏవిధమైన పన్నులు కట్టవలసిన అవసరం లేదు.


బహ్రెయిన్ దినార్


దీన్ని BHD గా పిలుస్తారు. అరేబియన్ గల్ఫ్ దేశాలలో దీన్ని వాడతారు. ఇది ఇండియన్ రుపీస్ లో మారకమవుతుంది. ఎక్కువ శాతం భారతీయులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కారణం వల్లనే ఇది ఇండియన్ రుపీస్ తో మారకం అవుతోంది. ఒక BHD విలువ 212.64 ఇండియన్ రుపీస్ కు సమానం.


ఒమని రియాల్


దీన్ని OMR అని పిలుస్తారు. ఒమన్ దేశ అధికారిక కరెన్సి ఇది. మొదట వీరు భారతీయ కరెన్సీని అధికారిక కరెన్సీగా ఉపయోగించారు. అందుకే భారతదేశ కరెన్సీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. ఒక  OMR  విలువ 208.18 ఇండియన్ రుపీస్ కు సమానం.


జోర్దానియన్ దినార్ 


దీన్ని JOD గా పిలుస్తారు. ఇది ప్రపంచంలో ఉన్న నాలుగవ అతిపెద్ద కరెన్సీ. దీని మారకాన్ని యారోలతో జరుపుతారు. ఒక JOD విలువ 112.87 ఇండియన్ రుపీస్ కు సమానం. 


కెమేనియన్ డాలర్


కెమేనియన్ డాలర్ ప్రపంచంలో అయిదవ అతిపెద్ద కరెన్సీ. దీన్ని KYD గా పిలుస్తారు. ఇది యూఎస్ డాలర్లతో మారకంగా ఉంటుంది. ఒక KYD విలువ 96.19 ఇండియన్ రుపీస్ కు సమానం.



జిబ్రాల్ టర్ పౌండ్


దీన్ని GIP గా పిలుస్తారు. దీన్ని బ్రిటీష్ పౌండ్ తో మారకం జరుపుతారు. GIP కాయిన్స్ ను, కరెన్సీ నోట్స్ ను సెంట్రల్ బ్యాంక్ మైంటైన్ చేస్తుంది. ఒక GPI విలువ 94.64 ఇండియన్ రుపీస్ కు సమానం. 


 

బ్రిటీష్ పౌండ్


దీన్ని GBP అని పిలుస్తారు. జెర్సీ, గర్న్సీ దేశాల అధికారిక కరెన్సీ ఇది. ప్రపంచ దేశాలలో ఎక్కువగా చలామణి అవుతున్న కరెన్సీలలో నాలుగవ స్థానంలో ఉంది. ఒక GDP 94.36 ఇండియన్ రుపీస్ కు సమానం.   


స్విస్ ఫ్రాన్స్ 


స్విట్జర్లాండ్, లైచెన్ స్టెయిన్ దేశాల కరెన్సీ ఇది. ఇది యూరప్ దేశమే. దీన్ని CHD గా పిలుస్తారు. ఒక CHD విలువ 

81.21 ఇండియన్ రుపీస్ కు సమానం.


యాఎస్ డాలర్


యూఎస్ డాలర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. దాదాపు యారోలకు సమానంగా ఉండే డాలర్ ప్రపంచంలో ఎక్కువగా చలామణిలో ఉన్న కరెన్సీ. అన్ని దేశాలలో దీని హవా కొనసాగుతోంది. ఎన్నో సంవత్సరాల నుండి దీని విలువ పెరుగుతూ బలపడుతోంది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ 80.12 ఇండియన్ రుపీస్ కు సమానం. 


 యూరో...


యూరో అనేది యూరోజోన్ అధికారిక కరెన్సీ.  ఈ యూరోజోన్ లో యూరోపియన్ యూనియన్, ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, ఎస్టోనియా, ఫిన్ లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథునియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లొవేకియా, స్పెయిన్ మొదలైన దేశాలు సమూహంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ యూరో కరెన్సీ విలువ 79.82 ఇండియన్ రుపీస్ కు సమానం.


ఈ కరెన్సీ ఎందుకు ఇంత విలువ అంటే ఆయా దేశాలలో చమురు ఉత్పత్తులు, ఎగుమతులు, రవాణా వంటి వాటిలో ఆర్థికంగా బలపడిన దేశాలు కావడం వలన ఆ దేశాల కరెన్సీలకు సహజంగానే విలువ పెరుగుతుంది. 

Updated Date - 2022-10-01T16:06:36+05:30 IST