పంట మార్పిడితో అధిక లాభాలు

ABN , First Publish Date - 2021-10-29T05:27:30+05:30 IST

పంట మార్పిడితో అధిక లాభాలను పొందవచ్చని వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్ననేని రమేష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

పంట మార్పిడితో అధిక లాభాలు
ధాన్యం తేమ శాతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ రమేష్‌బాబు

- వేములవాడ  ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

వేములవాడ టౌన్‌, అక్టోబరు 28 : పంట మార్పిడితో అధిక లాభాలను పొందవచ్చని వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్ననేని రమేష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రైతుల పక్షాన పని చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రైతుల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆ ఘనత కేవలం సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఎంతో మంది రైతు కుటుంబాలకు భరోసా కల్పించిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన 277 మంది రైతుల కుటుంబాలకు రూ.13.85 కోట్ల  రైతు బీమా అందించినట్లు చెప్పారు.   అనంతరం జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందన్నారు.  అనంతరం సింగిల్‌ విండో చైర్మన్‌ తిరుపతిరెడ్డి  మాట్లాడుతూ రైతులు ఉపయోగార్థం  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్పర్సన్‌ రామతీర్థపు మాధవిరాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మాండ్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్‌, గొస్కుల రవి, పట్టణ అఽధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు, సర్పంచులు, సింగిల్‌ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:27:30+05:30 IST