వాణిజ్య పంటలతో అధిక లాభాలు పొందాలి

ABN , First Publish Date - 2020-06-06T09:48:36+05:30 IST

వాణిజ్య పంటల సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు

వాణిజ్య పంటలతో అధిక లాభాలు పొందాలి

ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి


ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 5 : వాణిజ్య పంటల సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని  మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలో కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమిలో మంత్రి పాల్గొన్నారు. కాడెద్దులతో నాగలి దున్ని ఏరువాకను ప్రారంభించారు. అనంతరం జరిగిన రైతు సదస్సులో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడాలేనటువంటి అన్ని రకాల పంటలకు అనువైన భూములు ఉన్నాయన్నారు.


మూస ధోరణిలో వరి, మొక్కజొన్న అంటూ సాగుబడి చేసి రైతులు అప్పులపాలు కావద్దని, నియంత్రిత పంటల సాగుతో అధిక దిగుబడులు సాధించి రైతు రాజుగా మారాలన్నారు.వ్యవసాయానికి అనువైన నీరు, విద్యుత్‌, పెట్టుబడులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అందజేస్తుందన్నారు. కంది, పెసర, పామాయిల్‌, కూరగాయల సాగు, వేరుశనగ లాంటి పంటలను వేసి ప్రతి ఒక్క రైతు అధిక దిగుబడులు సాధించి వ్యవసాయంపై మక్కువ చూపాలన్నారు. జిల్లాకు కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీటితో ఏడాదిలో 10 నెలలు వ్యవసాయానికి సాగు నీరు ఇస్తామన్నారు.


నియంత్రిత సాగుతో  విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతులను సంఘటితం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి రాష్ట్ర ంలో సాగిన సమైక్య పాలనలో ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు ఆరేళ్లు పట్టిందన్నారు.తొలకరి జల్లుతో అప్పుకోసం రైతు అవస్థలు పడ కుండా రైతుబంధు పథకాన్ని అందిస్తున్నామన్నారు. 24గంటల నాణ్యమైన కరెంటును ఉచితంగా ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకేళ్ళేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో పండించిన పంటను అమ్ముకోలేని రైతన్నకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు.


ఏరువాక కార్యక్రమంలో సుమారు 100మంది రైతులు పాల్గొన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి కుమారుడు వేమన్‌రెడ్డి నాగలితో దున్ని ఆకట్టుకున్నాడు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, రైతు సమన్వయ సమతి జిల్లా అధ్యక్షుడు రజాక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌జడ్పీటీసీ జీడి బిక్షం,జేడీఏ జ్యోతిర్మయి,నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉపేందర్‌రెడ్డి, శ్రీధర్‌, రామారావునాయక్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-06T09:48:36+05:30 IST