Abn logo
Sep 18 2021 @ 00:42AM

విద్యతోనే ఉన్నతస్థాయికి..

- పాఠశాల విద్యా కమిషనర్‌ చినవీరభద్రుడు 

కదిరి, సెప్టెంబరు 17: విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్య అందరి తలరాతలు మారుస్తుందని పాఠశాల విద్యా కమిషనర్‌ చినవీరభ ద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేసిన నాడు-నేడు పనులను పరిశీలించారు. మొదట ఆయ నకు పాఠశాల హెచ్‌ఎం శాంతమ్మ, ఎంఈఓ చెన్నక్రిష్ణలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అన్ని గదులు, నూతనంగా నిర్మించిన మూత్ర శాలలు, మరుగుదొడ్లు పరిశీలించారు. ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డితో కలిసి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడు తూ విద్యతోనే అందరి తలరాతలు మారుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో అనేక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదువుకోవడానికి పాఠశాలల్లో కల్పించారని చెప్పారు. అందులో భాగంగానే నాడు-నేడు పనులను పాఠశాలలో చేపట్టారని గుర్తు చేశారు. నాడు-నేడు పనులు ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యతో పాటు సౌకర్యాలు కూడా కల్పించారన్నారు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే రెండు సంవత్సరాలలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెడతా మన్నారు. కదిరిలో పాఠశాలలో కూడా ప్రారంభిస్తామన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కమిషనర్‌, ఎమ్మెల్యే, ఎస్‌సీఈ ఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ రవీంద్రారెడ్డి విద్యార్థులతో కలిసి నెలపై కూర్చుని తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ అమృత, కౌన్సిలర్‌లు కిన్నెర కల్యాణ్‌, జిలాన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఏ రాజశేఖర్‌రెడ్డి,  కొమ్ము గంగాదేవీ తదితరులు పాల్గొన్నారు.