జాతీయ విద్యా విధానంతో అంతరాలు పెరుగుతాయి

ABN , First Publish Date - 2022-06-22T14:41:13+05:30 IST

జాతీయ విద్యా విధానం అంతరాలు పెంచుతుందని మద్రాసు హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుచేయాలని కోరుతూ

జాతీయ విద్యా విధానంతో అంతరాలు పెరుగుతాయి

                              - హైకోర్టుకు తెలిపిన రాష్ట్రప్రభుత్వం


చెన్నై, జూన్‌ 21: జాతీయ విద్యా విధానం అంతరాలు పెంచుతుందని మద్రాసు హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుచేయాలని కోరుతూ అర్జునన్‌ ఇళయరాజా మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖల కార్యదర్శులు బదులు పిటిషన్‌ దాఖలుచేశారు. విద అనేది రాష్ట్ర విధానమని, జాతీయ విద్యా విధానానికి ఎలాంటి చట్టపరమైన గుర్తింపు లేదన్నారు. 69 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌, తమిళంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్‌, అందరికి సమాన విద్య అందించాలే లక్ష్యంతో రాష్ట్రంలో ద్విభాషా విధానం, మాతృభాషలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో విద్యార్థుల చేరిక 27.1 శాతం నుంచి 2035లో 50 శాతానికి పెంచేలా జాతీయ విద్యా విధానం రూపొందిందని తెలిపారు. ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌ సహా ఉపకారవేతనాల ద్వారా అడ్మిషన్లు 51.4 శాతం పెరిగాయని తెలిపారు. ఆ క్రమంలో, ప్రస్తుత విధానంలో అంతరాలు ఏర్పరిచేలా ఉన్న జాతీయ విద్యా విధానం ఉందన్నారు. తమిళనాడు చారిత్రక వారసత్వం, భవిష్యత్తులో విద్య విధానంలో మార్పుల కోసం మాజీ న్యాయమూర్తి మురుగేశన్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేశామన్నారు. కాబట్టి ఈ పిటిషన్‌ విచారణకు అనుకూలం కాదని, జరిమానాతో పిటిషన్‌ తోసిపుచ్చాలని రాష్ట్రప్రభుత్వం బదులు పిటిషన్‌లో తెలిపింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-06-22T14:41:13+05:30 IST