యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2021-10-20T05:01:01+05:30 IST

మామిడి తోట రైతులు యాజమాన్య పద్ధతులను అవలంభిస్తే అధిక దిగుబడులు పొందవచ్చునని జిల్లా ఏపీయంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
మామిడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్న దృశ్యం

 ఏపీయంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి

గాలివీడు, అక్టోబరు19: మామిడి తోట రైతులు యాజమాన్య పద్ధతులను అవలంభిస్తే అధిక దిగుబడులు పొందవచ్చునని జిల్లా ఏపీయంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నూలివీడు గ్రామం నక్కలవాండ్లపల్లె ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మామిడి రైతులకు యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ శాస్త్రవేత్త శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మామిడిలో ఈ సారి పూత ఆలస్యంగా వస్తుందన్నారు. మామిడిలో పూత రావాలంటే జూన్‌, జులై నెలల్లో కొమ్మలు కత్తిరించాలన్నారు. డార్ములా-4, మల్లీకేలను మామిడి తోటలో పిచికారీ చేయాలని, బీర్డు మిశ్రమాన్ని చెట్లపై పిచికారీ చేయాలన్నారు. మామిడిలో వచ్చే పండుఈగ నివారణకు ఎకరానికి ఆరు నుంచి 8 బోన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆల్కహాల్‌ 6ఎంఎల్‌తో మెలతిన్‌ ఒక ఎంఎల్‌ మెథిల్‌ యూజినల్‌ మిశ్రమాన్ని మామిడిలో పిచికారీ చేస్తే బాగా పూతవస్తుందన్నారు.కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారి వనిత, మామిడి రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:01:01+05:30 IST