Abn logo
Oct 23 2021 @ 23:46PM

అపరాల సాగుతో అధిక దిగుబడులు

మాట్లాడుతున్న కృష్ణదాస్‌

  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

గుజరాతీపేట: వరి తర్వాత అపరాలను సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. వరి మాగాణుల్లో అపరాల ఉత్పాదకత పెంచే కార్యాచ రణపై శనివారం జడ్పీ సమావేశంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు. రైతులు అంతర పంటలుగా అపరాలను వేయాలని, దీనివల్ల భూమి సారవంతమవు తుందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునన్నారు. రైతులు శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకోవాలని సూచించారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ... రైతులు కొత్తవంగడాలు, ఎక్కువ దిగుబడులు ఇచ్చే విత్తనాలను వినియోగించాలన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ మాట్లాడుతూ.. రబీలో అపరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్‌ శివాజీ, జేసీ సుమిత్‌కుమార్‌, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ విస్తరణ సంచాలకుడు  ఆలపాటి సత్యనారాయణ, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సిమ్మ నేతాజి పాల్గొన్నారు.