Abn logo
Aug 28 2021 @ 13:47PM

చార్మినార్ వద్ద బీజేపీ సభ.. పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్ : చార్మినార్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ సభను చిత్రీకరిస్తోన్న డ్రోన్ కేమెరాను పోలీసులు తీసుకెళుతుండగా రచ్చ ప్రారంభమైంది. డ్రోన్ కెమెరాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ వర్సెస్ పోలీసులు ఉద్రిక్తతకు పాల్పడ్డారు. రెండు సార్లు పోలీసులకు బండి సంజయ్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో బీజేపీ నేత మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. చార్మినార్ పీఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీగా గుమికూడారు.