Badvel By-Poll కౌంటింగ్‌‌కు భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2021-11-02T12:00:23+05:30 IST

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు..

Badvel By-Poll కౌంటింగ్‌‌కు భారీ బందోబస్తు

కడప : బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు 400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతో ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, పోలీస్‌ కేంద్ర బలగాల సిబ్బంది మొత్తం 400 మంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా మద్యం విక్రయించకూడదని హెచ్చరించారు.

Updated Date - 2021-11-02T12:00:23+05:30 IST