హైస్కూళ్లలో విలీనం కసరత్తు పూర్తి

ABN , First Publish Date - 2021-10-20T05:39:10+05:30 IST

నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాఽథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ప్రభుత్వ హైస్కూళ్లలో విలీనం చేసే ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది.

హైస్కూళ్లలో విలీనం కసరత్తు పూర్తి

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 19: నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాఽథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీప ప్రభుత్వ హైస్కూళ్లలో విలీనం చేసే ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆ మేరకు జిల్లాలో 225 ప్రాఽథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను 250 మీటర్ల పరిధిలోని 193 హైస్కూళ్లలో విలీనం చేయనున్నారు. ఇలా హైస్కూళ్లలో విలీనం చేసే ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ప్రతీ 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ఎంత మంది అవసరమవుతారో గుర్తించారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. 

15 కమ్యూనిటీ హాళ్లలో ప్రభుత్వ స్కూళ్లు

 ఎయిడెడ్‌ విద్యార్థుల సర్దుబాటుకు యత్నాలు

ప్రభుత్వ పాఠశాలల్లోకి ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థుల ను సర్దుబాటు చేసే ప్రక్రియను జిల్లా విద్యాశాఖ వేగవం తం చేసింది. తొలుత విలీనానికి అంగీకరించిన 179 ఎయి డెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థులను సమీప ప్రభుత్వ /జడ్పీ/ ఎంపీపీ/మునిసిపల్‌ పాఠశాలల్లోకి సర్దుబాటు చేయడానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార లేఖలను తీసు కుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపు పూర్తికాగా, ఎయిడెడ్‌ పాఠశాలలకు సమీపంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో 15చోట్ల కమ్యూనిటీ హాళ్ళల్లో కొత్తగా పాఠశా లలను తెరవాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఆ మేరకు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై నిర్ణయం రావాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం వచ్చిన వెంటనే ఎయిడెడ్‌ విద్యార్థులందరినీ సమీప పాఠశాలలకు తరలిస్తారు.


Updated Date - 2021-10-20T05:39:10+05:30 IST