వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. అటువంటి మార్క్‌ని క్రియేట్ చేశారు నిర్మాత అశ్వనీదత్. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తమ సంస్థ స్టామినా ఏంటో తెలిపేందుకు తాజాగా ఆయన చేస్తున్న చిత్రాలే నిదర్శనం. ప్రభాస్‌తో పాన్ ఇండియా ఫిల్మ్, అందులో దీపికా పదుకొనే, అమితాబ్ వంటి వారు నటించడం అంటే.. అసలు ఈ ప్రాజెక్ట్‌కి ఆకాశమే హద్దు అని చెప్పుకోవాలి. 'మహానటి' వంటి మెమరబుల్ హిట్‌ని ఇచ్చిన నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో.. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈలోపు స్వప్న సినిమాస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ నిర్మాతగా అనుదీప్ కె.వి. దర్శకత్వంలో ఓ సినిమాని కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతోన్న నేపథ్యంలో పబ్లిసిటీ ఓ రేంజ్లో చేస్తున్నారు మేకర్స్. ఇంకా చెప్పాలంటే విజృంభించేశారు అనే చెప్పాలి.
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషించిన ఈ చిత్రం నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయబోతోన్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించడంతో.. ఒక్కసారిగా ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చేసింది. పబ్లిసిటీ పరంగా ఏ విషయంలోనూ వెనుకాడకుండా.. మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టారు. సినిమాలో ఉన్న కంటెంట్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో నటించిన టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి సంభాషణతో వచ్చిన వీడియో అయితే ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనేలా ఉందంటే అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే నవీన్ అంత హుషారుగా ఈ వీడియోలు కనిపిస్తున్నాడు. మరి ఆ హుషారు ఏంటో, పబ్లిసిటీ విజృంభణ ఏంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.