Abn logo
Sep 25 2021 @ 00:12AM

ఆరుతడి పంటలతోనే అధిక లాభాలు

పెద్దమందడిలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి

వనపర్తి రూరల్‌, సెప్టెంబరు 24: రైతులు ఆరుత డి పంటల సాగుతోనే అధిక లాభాలు పొందవచ్చున ని జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అంకూర్‌, కాసీంనగర్‌, సవాయిగూ డెం, పెద్దగూడెం, చందాపూర్‌ గ్రామాల్లోని రైతు వేది కలలో పంట మార్పిడిపై శుక్రవారం అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది యాసంగిలో వరికి ప్రత్యా మ్నాయంగా ఆరుతడి పంటలైన వేరుశనగ, ఆము దం, నువ్వులు, అపరాలు, పెసర, మినుము, అలసం దలు, కూరగాయ పంటలు సాగు చేసుకోవాలని సూ చించారు. ఆరుతడి పంటల సాగు చేస్తే తక్కువ పె ట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చునని తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ ధర్మశాస్త్రి, ఎంపీటీసీ రంగారెడ్డి, మండల వ్యవసాయాధికారి కురుమయ్య, విస్తరణాధికారి వంశీ, ఏఈవోలు సూర్యతేజ, సునీల్‌, కవిత, సురేష్‌, రైతుబంధు కో ఆర్డినేటర్‌ రెడ్డి, పృథ్వీరాజ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో..

ఆత్మకూరు : రైతులు రబీ సీజన్‌లో వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసి అధిక లాభాలు పొందాలని మండల వ్యవసాయ విస్తరణాధికారి వి నయ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని ఆరేపల్లి, ఆత్మకూరు, పిన్నంచర్ల క్లస్టర్‌ పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అత్యధి కంగా వరిసాగు చేయడం ద్వారా గిట్టుబాటు ధర కరువై పెట్టుబడి రాక  ఇబ్బంది పడుతున్నారని తెలి పారు. ఈ రబీ సీజన్‌లో వేరుశనగ, మినుములు, పె సర్లు, నువ్వులు, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల లో నేల స్వభావాన్నిబట్టి వరి సాగుచేసే రైతులు దొడ్డు రకాలు కాకుండా సన్న రకాలను సాగు చేయా లని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల స ర్పంచ్‌లు ఎంపీటీసీలు, మహిమూద్‌, పరమేష్‌, ప్ర శాంతి, శ్యామల, విజయలక్ష్మి, వ్యవసాయాధికారులు మహేశ్వరి, శివకుమార్‌, సింధూజ, రైతు సమన్వయ సమితి సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, వీరేశలింగం తదితరులు పాల్గొన్నారు.

పెద్దమందడిలో..

పెద్దమందడి:  రైతులు యాసంగిలో ఆరుతండి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికా రి సుధాకర్‌రెడ్డి అన్నారు. బలిజపల్లి రైతు వేదిక భవనంలో శుక్రవారం  రైతులకు పంట మార్పిడిపై ఏర్పాటు చేసిన సమావేశానికి  ఆయన హాజరై మా ట్లాడారు.  రైతులు అందరూ వరి సాగు చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయని, పంటల మార్పిడితో  తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. ఆరుతడి పంటలైన పెసర, మినుమ, ఆ ముదం, వేరుశనగ, కుసుమలు, అలసందలు, ఉలవ లు పొద్దుతిరుగుడు, జొన్నలు, రాగి, సజ్జలు కూర గాయలు, ఆకుకూరలు సాగు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందవచ్చునని తెలిపారు.  కార్యక్రమంలో వ్యవసాయాధికారి మల్లయ్య, వ్యవ సాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పంట మార్పిడితో అధిక లాభం  

గోపాల్‌పేట : ప్రతి ఏటా  రైతులు పంటలు మా ర్పిడి చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని జడ్పీ టీసీ మంద  భార్గవి, అన్నారు. శుక్రవారం వ్యవసా య శాఖా ఆధ్వర్యంలో గోపాల్‌పేట, రేవల్లి, మండల కేంద్రాల్లో బుద్దారం, పొలికపాడు, ఏదుల, ఏదుట్లతో పాటు రేవల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పం టల మార్పిడిపై అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమానికి జడ్పీటీసీ సభ్యుడు ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. వచ్చే యాసంగిలో ఆరుతడి పంట లు సాగుచేసుకోవాలని తెలిపారు.  తప్పనిసరి పరిస్థి తుల్లో సన్నరకం వరి సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రజిని, పద్మమ్మ, నాగమణి, శ్రీలత, ఎంపీటీసీలు, రత్నకుమారి, బాల్‌రెడ్డి, నరేందర్‌, వ్యవసాయ అధికారులు నరేష్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, నాయకులు, రైతులు పాల్గొన్నారు.