ఎకో టూరిజానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-11-29T05:05:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు.

ఎకో టూరిజానికి అధిక ప్రాధాన్యం
పాలమూరు నుంచి బయలుదేరుతున్న ట్రెక్కింగ్‌ సభ్యులు

- ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేట, నవంబరు 28: రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. మహబూబ్‌నగర్‌ ట్రెక్కింగ్‌ క్లబ్‌, సారిక వాకర్స్‌ క్లబ్‌ సంయుక్తంగా ఆదివారం 90 మందితో ట్రెక్కింగ్‌ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. మహిళలు, పిల్లలు సైతం పాల్గొని మన్ననూర్‌ నుంచి ఉమామహేశ్వరం ఆలయం వరకు ట్రక్కింగ్‌ చేశారు. అటవీశాఖ సిబ్బంది సహకారంతో ఎంతో ఉత్సాహంగా అడవిలో కొండలు గుట్ట లు దాటుతూ కాలిబాటన ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతిపెద్దదైన టైగర్‌ ప్రాజెక్టులో ట్రెక్‌ చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. టూరిజం కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ట్రెక్కింగ్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, కార్యదర్శులు డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, రమేష్‌గౌడ్‌, శంకరయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-11-29T05:05:39+05:30 IST