ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు అరికట్టాలి

ABN , First Publish Date - 2021-06-24T05:32:55+05:30 IST

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు అరికట్టాలి
డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేవైఎం నాయకులు

జిల్లావ్యాప్తంగా బీజేవైఎం నిరసనలు
భువనగిరి టౌన / మోత్కూరు / చౌటుప్పల్‌ టౌన / వలిగొండ / యాదాద్రి రూరల్‌ / రామన్నపేట, జూన 23 :
ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిర్వహించిన నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు గుర్తించి ఫీజులను అరికట్టాలన్నారు.  జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట  బీజేవైఎం నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతానికంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంతో పాటు, జీవో నెంబర్‌ 46ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఈవోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిఽధి పుల్ల శివశంకర్‌, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కానుకుంట్ల రమేష్‌, వాస నర్సింగ్‌, వల్లంశెట్టి నగేష్‌, గాదె లక్ష్మణ్‌, కుచ్చుల మహేష్‌, కోళ్ల భిక్షపతి, మేడి కోటేష్‌ తదితరులు పాల్గొన్నారు. మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతి శివకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోతరబోయిన వీరస్వామి, జిల్లా కార్యదర్శి సీహెచ.నరే్‌ష, నాయకులు జి.సతీష్‌, జమీల్‌, నవీన, అరవింద్‌, అరుణ్‌ పాల్గొన్నారు. చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలె చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షుడు మునగాల రాజశేఖర్‌రెడ్డి, నాయకులు దిండు భాస్కర్‌, కృష్ణ, కిషోర్‌, గౌతమ్‌, వెంకటేష్‌, శివ, శ్రీకాంత, మల్లికార్జున పాల్గొన్నారు. వలిగొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి గండికోట హరికృష్ణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్యగౌడ్‌, మండల అధ్యక్షుడు నాగవెల్లి సుధాకర్‌గౌడ్‌, సీనియర్‌ నా యకులు కణతాల అశోక్‌రెడ్డి, రాచకొండ కృష్ణ, నాయకులు మైసోళ్ల మత్స్యగిరి, సుదర్శన, వెంకటేశం పాల్గొన్నారు.  యాదగిరిగుట్టలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ అశోక్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో నాయకులు కంటం ప్రశాంత్‌, ఎరుకల చైతన్య, కళ్లెం మహేష్‌, చుక్క ల రాము, కోల విక్రమ్‌, సుంచు శ్రవణ్‌, గిరి, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. సంస్థాన నారాయణపురం తహసీల్దార్‌ బ్రహ్మయ్యకు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అం దించారు. వినతిపత్రం అందించిన వారిలో బీజేపీ జిల్లా కార్యదర్శి సూరపల్లి శివాజీ, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి సుర్వి రాజు, నాయకులు దోర్నాల శ్రీధర్‌, జక్కర్తి గణేష్‌, శ్రీకాంత, రాపర్తి ప్రదీప్‌, మంజునాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సాయి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సైదులు, శ్రీధర్‌రెడ్డి, గర్దాసు సతీష్‌, నవీన, నరేష్‌, శ్రీకాంత, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:32:55+05:30 IST