High Drama నడుమ తిరిగి ఢిల్లీకి BJP నేత Bagga

ABN , First Publish Date - 2022-05-06T21:59:09+05:30 IST

బగ్గాను పంజాబ్ పోలీసుల నుంచి ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుని ఆయనను తిరిగి ఢిల్లీకి తీసుకువస్తున్నారు. బగ్గాను అరెస్ట్ చేసి సగం వరకు వెళ్లిన పంజాబ్ పోలీసులు.. ఖాళీ చేతులతో స్వరాష్ట్రం పయనం అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న..

High Drama నడుమ తిరిగి ఢిల్లీకి BJP నేత Bagga

చండీగఢ్: భారతీయ జనతా పార్టీ (BJP) ఢిల్లీ యూనిట్ అధికార ప్రతినిధి Tajinder Pal Singh Bagga ను Punjab పోలీసులు Delhi కి వచ్చి Arrest చేసిన విషయం తెలిసిందే. కాగా, బగ్గాను పంజాబ్ తీసుకెళ్తుండగా హర్యానాలోని Kurukshetra వద్ద Punjab పోలీసుల్ని Haryana పోలీసులు అడ్డుకున్నారు. ఇదీ కాకుండా బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బగ్గా వివాదం రెండు రాజకీయ పార్టీలను దాటి మూడు రాష్ట్రాల పోలీసుల మధ్య హైడ్రామాగా మారింది.


కాగా, బగ్గాను పంజాబ్ పోలీసుల నుంచి ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుని ఆయనను తిరిగి ఢిల్లీకి తీసుకువస్తున్నారు. బగ్గాను అరెస్ట్ చేసి సగం వరకు వెళ్లిన పంజాబ్ పోలీసులు.. ఖాళీ చేతులతో స్వరాష్ట్రం పయనం అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో పంజాబ్‌లోని మొహాలీలో బగ్గాపై కేసు నమోదైంది. ఈ కారణంతో బగ్గాను ఢిల్లీలోని అతని నివాసం నుండి అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. బగ్గాను తీసుకుని ఢిల్లీ నుంచి మొహాలీకి వెళ్తున్న పంజాబ్ పోలీసుల వాహనాలను హర్యానాలోని కురుక్షేత్ర వద్ద హర్యానా పోలీసులు నిలిపివేశారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులతో సైతం పంజాబ్ పోలీసులు చర్చిస్తున్నారట. అయితే ఇంత డ్రామా నడుస్తున్న నేపధ్యంలో ఏ రాష్ట్ర పోలీసులు ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

Read more