సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-02-26T00:13:20+05:30 IST

సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ జరిగింది. 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు వక్ఫ్ బోర్డుకు నివేదిక

సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: సుల్తాన్‌షాహీ శ్మశానవాటిక ఆక్రమణపై హైకోర్టులో విచారణ జరిగింది. 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు వక్ఫ్ బోర్డుకు నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్  తెలిపారు. శ్మశానవాటికలో 815 చదరపు మీటర్లు కబ్జా అయ్యిందని 2018లోనే నివేదిక ఇచ్చామని కోర్టుకు కలెక్టర్ తెలిపారు. కబ్జాలపై పట్టించుకోరా అని వక్ఫ్ బోర్డుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకొని, నివేదిక సమర్పించాలని వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-02-26T00:13:20+05:30 IST