ఇళ్ల స్థలాలపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2022-05-28T05:16:15+05:30 IST

మండలంలోని పత్తేగడ పంచాయతీ కొటాల గుట్టపై ఇళ్ల స్థలాలు కేటాయించాలని జరుగుతున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసిం ది. ఈ గుట్టలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికే కాకుండా మరే ఇతర పథకాలకూ ఈ గుట్టను కేటాయించరాదని శుక్రవారం హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో కలికిరి తహసీల్దారును ఆదేశించింది. ఈ మేరకు కొటాల గ్రామస్థులు దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ను అనుమతించి, విచారించిన హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు మధ్యం తర ఉత్తర్వులను జారీ చేశారు.

ఇళ్ల స్థలాలపై హైకోర్టు స్టే
ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన కొటాల గుట్ట

నవరత్నాల ఇళ్లతో పాటు ఏ ఇతర పథకాలకు కేటాయించరాదని ఆదేశాలు

కలికిరి, మే 27: మండలంలోని పత్తేగడ పంచాయతీ కొటాల గుట్టపై ఇళ్ల స్థలాలు కేటాయించాలని జరుగుతున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసిం ది. ఈ గుట్టలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికే కాకుండా మరే ఇతర పథకాలకూ ఈ గుట్టను కేటాయించరాదని శుక్రవారం హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో కలికిరి తహసీల్దారును ఆదేశించింది. ఈ మేరకు కొటాల గ్రామస్థులు దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ను అనుమతించి, విచారించిన హైకోర్టు న్యాయమూర్తి కె.మన్మథరావు మధ్యం తర ఉత్తర్వులను జారీ చేశారు. కొటాల గుట్టగా చెబుతున్న మర్రికుంట పల్లె గ్రామ సర్వే నెంబరు 600/3లోని 18.74 ఎకరాలను ఇళ్ల స్థలాలకే కాదు మరే ఇతర కార్యక్రమానికి కేటాయించరాదని కోర్టు స్పష్టం చేసింది. కొటాల గుట్టలో జగనన్న కాలనీ నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 14న గుట్టను ప్రొక్లైనర్లతో చదును చేసేం దుకు సమాయత్తమయ్యారు. లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకముందే దీన్ని చదును చేసే పనులు చేపట్టారు. అయితే దీన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై 15న ‘ఆంధ్రజ్యోతి’లో ‘కొటాలగుట్టపై మళ్లీ వివాదం’ కథనం ప్రచురితమైంది. ఆ తరువాత చదును కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇళ్ల పట్టాలు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సానుకూలంగా స్పందించింది. గ్రామంలోని పశువుల మేత కోసం ఈ గుట్ట ఒక్కటే ఆధారమని గ్రామస్థు లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని కూడా కోరారు. కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించరాద ని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా గ్రామస్థులు ప్రస్తావించారు. 

Updated Date - 2022-05-28T05:16:15+05:30 IST