ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-12-05T08:33:06+05:30 IST

బ్యాలెట్‌ పేపర్‌పై స్వస్తిక్‌ గుర్తే కాక.. ఏ మార్కర్‌ పెన్నుతో టిక్కు పెట్టినా ఆఓటును పరిగణలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం రాత్రి జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టు నిలిపివేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, జీహెచ్‌ఎంసీ

ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టు స్టే

కౌంటింగ్‌లో స్వస్తిక్‌ గుర్తునే 

పరిగణించాలని స్పష్టీకరణ

వివరాలతో కౌంటర్‌కు ఆదేశం

విచారణ ఈనెల 7కు వాయిదా

స్వస్తిక్‌ గుర్తునే పరిగణించాలని స్పష్టీకరణ

పూర్తి వివరాలతో కౌంటర్‌కు ఆదేశం

విచారణ డిసెంబర్‌ 7కు వాయిదా


హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బ్యాలెట్‌ పేపర్‌పై స్వస్తిక్‌ గుర్తే కాక.. ఏ మార్కర్‌ పెన్నుతో టిక్కు పెట్టినా ఆఓటును పరిగణలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం రాత్రి జారీచేసిన సర్క్యులర్‌ను హైకోర్టు నిలిపివేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. వేరే గుర్తులున్న బ్యాలెట్లను లెక్కించి పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. మొదటి ఇద్దరు పోటీదారుల్లో ఓట్ల తేడా.. అలా పక్కన పెట్టిన బ్యాలెట్లకంటే అధికంగా ఉంటే ఆయా డివిజన్లలో అభ్యర్థుల గెలుపు ప్రకటించవచ్చని తెలిపింది.


స్వల్ప తేడా ఉంటే అలాంటి డివిజన్ల ఫలితాలు ప్రకటించవద్దని స్పష్టం చేసింది. చెల్లని బ్యాలెట్లను ఇతర బ్యాలెట్లతోపాటు జాగ్రత్తగా భద్రపర్చాలని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌కు ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 7కి వాయిదా వేస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. అభిషేక్‌రెడ్డి శుక్రవారం ఉదయం హౌస్‌మోషన్‌లో ఆదేశాలు జారీచేశారు. గురువారం రాత్రి ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ బీజేపీ నాయకులు కె. ఆంథోనీరెడ్డి, కె. సురెందర్‌రెడ్డి శుక్రవారం ఉదయం హౌస్‌మోషన్‌లో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా... హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశం ఎత్తివేయాలని కోరుతూ ఎస్‌ఈసీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతోపాటు సింగిల్‌ జడ్జి ఆదేశాలపై అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు శనివారం హౌస్‌మోషన్‌లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2020-12-05T08:33:06+05:30 IST