అమరావతి: బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరుపుతున్నారంటూ సిరివరపు శ్రీధర్శర్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 7 జిల్లాలో ఎన్నికలు జరిగాయని పిటిషనర్ తెలిపారు. ఎన్నికలకు ముందేరోజు నోటిఫికేషన్ ఇచ్చారని పిటిషనర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి తమ అనుచరులను ఏకపక్షంగా సొసైటీసభ్యులుగా ఎన్నకున్నారని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ తరపున లాయర్ చింతలపాటి సోమయాజులు వాదించారు. కౌంటర్ దాఖలుకు ఏపీ కోఆపరేటివ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఈవో, కోఆపరేటివ్ కమిషనర్, చైర్మన్కు న్యాయస్థానం నోటీసులిచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.