తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

ABN , First Publish Date - 2021-02-25T23:35:24+05:30 IST

ఆదేశాలను అమలు చేయనందుకు హైకోర్టు సీరియస్‌ అయింది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటులో జాప్యంపై

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

హైదరాబాద్‌: ఆదేశాలను అమలు చేయనందుకు హైకోర్టు సీరియస్‌ అయింది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటులో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సభ్యులను నియమించాలన్న ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆమోద యోగ్యం కాదనని కోర్టు పేర్కొంది. కోర్టులో విచారణకు కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీం హాజరయ్యారు. బోర్డు ఏర్పాటుకు 2019లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కమిషనర్ తెలిపారు. కార్మిక శాఖ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవడానికి జాప్యం ఎందుకు? అని హైకోర్టు ప్రశ్నించింది. మార్చి 18న విచారణకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-02-25T23:35:24+05:30 IST