సాయిగణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-04-22T21:03:26+05:30 IST

బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కు

సాయిగణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. సాయిగణేష్ మృతికి మంత్రి, జిల్లా పోలీసులే కారణమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ ఘటనలో 8 మందిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. కేసు విచారణలో ఉన్నందున తమకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టును కోరారు. కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 29కు వాయిదా వేశారు.


మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ భర్త ప్రసన్నకృష్ణ కలిసి సాయిగణేష్‌పై పలు కేసుల పెట్టించి.. పదేపదే స్టేషనకు పిలిపించి వేధింపులకు గురిచేశారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాయిగణేష్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-22T21:03:26+05:30 IST