Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులిచ్చింది. కేయూ, తెలుగు వర్సిటీలకు వీసీల నియామకంపై హైకోర్టులో విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్‌ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వీసీల నియామకం జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, యూజీసీకి కోర్టు ఆదేశించింది. కేయూ వీసీ రమేష్‌, తెలుగు వర్సిటీ వీసీ కిషన్‌రావుకు హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement