Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైకోర్టులో ఫొటో ప్రదర్శన

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాది పరిషత్‌ సంయుక్తంగా శుక్రవారం హైకోర్టులో ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ప్రముఖులు, రాజ్యాంగంలోని ఎంపిక చేసిన భాగాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. న్యాయవాదుల సంఘం ఉపాఽధ్యక్షుడు పీఎన్‌ మూర్తి, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌, న్యాయవాద పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసల పొన్నరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement