Hyderabad: మహేష్ బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లకు జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-08-30T04:15:52+05:30 IST

మహేష్ బ్యాంకు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు అనుమతి లేకున్నా బ్యాంక్ లావాదేవీలు...

Hyderabad: మహేష్ బ్యాంకు చైర్మన్,  డైరెక్టర్లకు జైలు శిక్ష

హైదరాబాద్: మహేష్ బ్యాంకు (Mahesh Bank) చైర్మన్‌తో పాటు డైరెక్టర్లకు హైకోర్టు (High Court) జైలు శిక్ష విధించింది. కోర్టు అనుమతి లేకున్నా బ్యాంక్ లావాదేవీలు జరిపారు. కేసు విచారణ నేపథ్యంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని గతంలో హైకోర్టు ఆదేశింది.  ఈ ఆదేశాలను ఉల్లంఘంచినందుకు తాజాగా వీరికి కోర్టు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ బంజ్‌‌ (Chairmen Ramesh Banj)తో పాటు పది మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధించింది. 


కాగా మహేష్ బ్యాంకు సిస్టమ్‌ను కొందరు దుండగులు హ్యాక్ (Hack) చేసి కోట్లు కొల్లగొట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో మహేష్ బ్యాంకు ఉద్యోగులకు హ్యాకర్లు 200 ఫిషింగ్ మెయిల్స్ పంపారు. ఇద్దరు ఉద్యోగులు ఫిషింగ్ మెయిల్స్ క్లిక్ చేయడంతో బ్యాంకు సాఫ్ట్ వేర్‌ను హ్యాక్ చేశారు. ఉద్యోగులు కంపూటర్లు షట్ డౌన్ చేసిన తర్వాత సిస్టమ్స్ ఓపెన్ చేసి బ్యాంకు అడ్మిన్ లాగిన్,  పాస్ వర్డ్ ను దుండగులు తస్కరించారు.


అలా డేటా బేస్‌లోని పూర్తి సమాచారాన్ని హ్యాకర్లు తెలుసుకునేవాళ్లు. అంతేకాదు 300 మందితో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి వారి ఖాతాల ద్వారా నగదును కొట్టేశారు. అయితే ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు.. మొత్తం 23 మందిని అరెస్ట్ చేశారు. బ్యాంకు సెక్యూరిటీలో యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-30T04:15:52+05:30 IST