ఆదిత్యుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-08-15T05:15:04+05:30 IST

సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు.

ఆదిత్యుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ మన్మథరావుకు జ్ఞాపికను అందిస్తున్న ఈవో


అరసవల్లి: సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో  హరిసూర్యప్ర కాష్‌ అందజేశా రు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి, ఫస్ట్‌ అడిషనల్‌ జడ్జి టి.వెంకటేశ్వరరా వు, ప్రోటోకాల్‌ జడ్జి కె.రాణి, వన్‌ టౌన్‌ ఎస్‌ఐ. ఎం.ప్రవల్లిక, ఆలయ ఇన్‌చార్జి సూపరింటెండెం ట్‌ కె.వెంకటేశ్వరరావు, జిల్లా కోర్టు సిబ్బంది, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. 

 ఆదివారం ఒక్కరోజు ఆదిత్యునికి రూ.3,81,490 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.1,56,700, విరాళాల రూపంలో రూ.74,790, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1.50లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.

 కూర్మనాథుని సన్నిధిలో..

గార: శ్రీకూర్మనాథుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు దంపతులు, జిల్లా ప్రధాన జడ్జి జి.గోపి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం  పలికారు. ఈవో జి.గురునాథరావు వారికి స్వామివారి ప్రసాదం అందజేశారు. ప్రధాన అర్చకులు సీతారామనరసింహాచార్యులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు శ్రీనివాసరావు, పూడి కమల, ఆలయ ఉద్యోగి నరుసుబాబు పాల్గొన్నారు.


 



Updated Date - 2022-08-15T05:15:04+05:30 IST