గండి అంజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

ABN , First Publish Date - 2021-10-26T04:47:44+05:30 IST

గండి క్షేత్రంలోని వీరాంజనేయస్వామిని సోమవారం హైకోర్టు జడ్జి, కడప అడ్మినిస్ర్టేటివ్‌ జడ్జి వెంకటరమణ దర్శించుకున్నారు.

గండి అంజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి
ఆలయంలో హైకోర్టు జడ్జి వెంకటరమణ

చక్రాయపేట, అక్టోబరు 25: గండి క్షేత్రంలోని వీరాంజనేయస్వామిని సోమవారం హైకోర్టు జడ్జి, కడప అడ్మినిస్ర్టేటివ్‌ జడ్జి వెంకటరమణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య సహాయ కమిషనర్‌ ముకుందరెడ్డి, ప్రధాన అర్చకులు కేసరి ఘనస్వాగతం పలికారు. వారితో పాటు కడప ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌ జడ్జి సి.పురుషోత్తంకుమార్‌, జడ్జిలు వి.శ్రీనివాస శివరామ్‌, షేక్‌ రియాజ్‌,  ఇశ్రాత్‌, ఫాతిమా ఉన్నారు.


గండి క్షేత్రం చేరుకున్న అహోబిలం పీఠాధిపతి  

అహోబిలం పీఠాధిపతి ఆదివణ్‌ శఠగోప రంగనాథయతీంద్ర మహాదేసికన్‌ సోమవారం గండి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతికి ఆలయ సహాయ కమిషనర్‌ ముకుందరెడ్డి, ప్రధాన అర్చకులు కేసరి, ఉప ప్రధాన అర్చకులు రాజా తదితరులు ఘనస్వాగతం పలికారు. గండి క్షేత్రంలో ఆంజనేయస్వామికి జరిగే దారుబింబ బాలాలయం ప్రతిష్ఠ మహోత్సవానికి పీఠాధిపతి హాజరైనట్లు సహాయ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితులు పీఠాధిపతి చేతుల మీదుగా మృత్తిక సంగ్రహణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:47:44+05:30 IST