ద్వారకా తిరుమల: చిన్న తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ ముఖ మండపంలో వారికి అర్చకులు స్వామి వారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు ఆమెకు శ్రీవారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. ప్రొటోకాల్ ఏఈవో రావిపాటి లక్ష్మణస్వామి పాల్గొన్నారు.