Advertisement
Advertisement
Abn logo
Advertisement

రంగడి సేవలో హైకోర్టు జడ్జి

నెల్లూరు (సాంస్కృతికం) నవంబరు 27 : హైకోర్టు జడ్జి, నెల్లూరు అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి కె.విజయలక్ష్మి శనివారం ఉదయం 7.30గంటలకు నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట జిల్లా జడ్జి సి.యామిని, ఎక్సైజ్‌ మినిస్ట్రేట్‌, ప్రొటోకాల్‌  అధికారి ఎన్‌.రాజశేఖర్‌ ఉన్నారు.  వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి డి.వెంకటేశ్వర్లు, దేవస్థాన చైర్మన్‌ ఇలపాక శివకుమార్‌ ఆచారి, అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించి స్వామి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా రంగనాథస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భగవద్గీత ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త సీఈవో వెంకటేశ్వర్లు, ధర్మప్రచార పరిషత్‌ కో ఆర్డినేటర్‌ దేవరాజు పర్యవేక్షించారు.

Advertisement
Advertisement