కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-01-21T23:01:27+05:30 IST

కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతం కంటే తగ్గిందని హైకోర్టు పేర్కొంది.

కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: కరోనాకు సంబంధించిన 24 పిల్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత గతం కంటే తగ్గిందని హైకోర్టు పేర్కొంది. కరోనా స్ట్రెయిన్ కేసుల పరిస్థితి ఎలా ఉందని న్యాయస్థానం ఆరా తీసింది. రాష్ట్రంలో 4 కరోనా స్ట్రెయిన్ కేసులు గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. వ్యాక్సినేషన్‌పై ప్రస్తుతం జోక్యం అనవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా టెస్ట్‌ల తీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. 24 పిల్‌లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రకటించింది. 3 మినహా మిగతా పిల్‌లపై కోర్టు విచారణను ముగించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-01-21T23:01:27+05:30 IST