తీర్పులో జాప్యం.. హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-10-06T19:03:26+05:30 IST

హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. పెండింగ్ కేసులో తీర్పు రాకపోవడంపై తీవ్ర నిరాశకు గురైన ఆమె హైకోర్టు మొదటి అంతస్థు నుంచి దూకేందుకు ప్రయత్నించింది.

తీర్పులో జాప్యం.. హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. పెండింగ్ కేసులో తీర్పు రాకపోవడంపై తీవ్ర నిరాశకు గురైన ఆమె హైకోర్టు మొదటి అంతస్థు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గోదావరి ఖనికి చెందిన కవిత అనే మహిళకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో ఉంది. ఈ కేసు చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉండటం... రోజులు గడుస్తున్నా తీర్పు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. కవితను అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి సిబ్బంది... సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న మురళీ అనే వ్యక్తి హత్యాచారం చేశాడని విచారణలో పేర్కొంది. 

Updated Date - 2020-10-06T19:03:26+05:30 IST