తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2020-08-13T16:11:46+05:30 IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టు విచారణ చేయనుంది.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై గురువారం  హైకోర్టు విచారణ చేయనుంది. విచారణకు హాజరుకావాలని గతంలో సీఎస్‌కు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణలో న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం అమలు చేసిన వాటిపై గురువారం మరోసారి హైకోర్టు విచారించనుంది.


ఐసీఎమ్మార్, డబ్ల్యూహెచ్‌వో గైడ్ లెన్స్‌ను తూచా తప్పక పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. ప్రతి రోజు కరోనా హెల్త్ బులిటెన్ తప్పులు లేకుండా ఇవ్వాలంది. కరోనా సమాచారాన్ని ప్రతి రోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని హైకోర్టు అదేశించింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.


గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరి అమలు చేస్తామని సీఎస్ అన్నారు. అమలు చేసిన అంశాలపై నివేదిక సమర్పించాలని సీఎస్‌కు గతంలో హైకోర్టు అదేశించింది. కాగా ఇవాళ సీఎస్ విచారణకు హాజరై రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వివరణ ఇవ్వనున్నారు.

Updated Date - 2020-08-13T16:11:46+05:30 IST