గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-03-16T21:20:56+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గతంలో గంగిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన

గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గతంలో గంగిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన సమయంలో కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. సాక్షులను బెదిరించారనేందుకు సాక్షాలు లేవని గంగిరెడ్డి తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది.


గతంతో కూడా గంగిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టు విచారణ జరిగింది. సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ1గా నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ షరతులు ఉల్లంఘించాడా? సాక్షులను బెదిరించాడా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ ఆధారాలు చూపకపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - 2022-03-16T21:20:56+05:30 IST