అమరావతి: అటవీ శాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం నుంచి వచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదని పిల్ దాఖలు చేశారు. సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినేందుకు విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.