High courtకు ఐదుగురు కొత్త జడ్జిలు

ABN , First Publish Date - 2022-07-22T16:50:30+05:30 IST

రాష్ట్ర హైకోర్టుకు ఐదుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొల్జియం సభలో తీర్మానించారు.

High courtకు ఐదుగురు కొత్త జడ్జిలు

బెంగళూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టుకు ఐదుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొల్జియం సభలో తీర్మానించారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకపు ప్రక్రియను చేపట్టిన కొల్జియం రాష్ట్రానికి ఐదుగురిని ఖరా రు చేసింది. ఈనెల 19న ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సారథ్యంలో సభ జరిగింది. రాష్ట్రానికి ఎంపికైన జడ్జిలలో అనిల్‌ భీమశేన కట్టి, గురుసిద్దయ్య బసవరాజ, చంద్రశేఖర్‌  మృ త్యుంజయ జోషి, ఉమేష్‌ మంజునాథ భట్టె ఆడిగ, తల్కాడ గిరిగౌడ శివంక్రేగౌడలు ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి ఈనెల 2న పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సతీష్‏చంద్ర శర్మా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్‌ ఛీఫ్‌ జస్టిస్‌ నియామకపు అంశంపైనా కొల్జియం సభలో చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే ఇప్పటిదాకా ఎవరినీ ఖరారు చేయలేదు.

Updated Date - 2022-07-22T16:50:30+05:30 IST