Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్.. ఎఫ్‌పీఎస్ హాజరుకావాలని ఆదేశం

అమరావతి: ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు‌కు రావాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు స్టేషనరీ కిట్స్ సరఫరా చేసినా.. బిల్లులు చెల్లించలేదని నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్  తరపున న్యాయవాది తేజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  2019లో బిల్లులు అందించినప్పటికీ, నేటి వరకు ప్రభుత్వం నగదు చెల్లించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా సమాధానం లేకపోవడంతో  హైకోర్టు సీరియస్ అయింది. ఈనెల 13న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 

Advertisement
Advertisement