ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు (గురువారం) బాంబే హైకోర్టు కొట్టివేసింది. ముంబైలోని జుహూలో ఉన్న ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండానే హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబరులో సోనూసూద్‌కు నోటీసులు పంపింది.
ఆ నోటీసులను సవాలు చేస్తూ సోనూ ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. బీఎంసీ నుంచి నోటీసులు వచ్చిన సమయంలోనే స్పందించాల్సిందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇప్పుడు తమ చేతుల్లో ఏమీ లేదని పేర్కొంటూ సోనూ పిటిషన్‌ను కొట్టి వేశారు.